రెండో రోజుకు చేరిన పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 2 : ఇంద్రకీలాదిపై కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారం నాటికి రెండోవ రోజుకు చేరుకున్నాయి. శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, బుధవారం నుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. భక్తులనుంచి మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం నాటితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం వుంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునాథ్‌ తెలిపారు.