రేపిస్టులకు ఉరే సరి : జయలలిత

చెన్నయ్‌, జనవరి 01 :ఆమె అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మంగళవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమెకలా జరగడం దురదృష్టకరమన్నారు. అత్యాచార నిందితులపై గూండా యాక్టు కేసు నమోదు చేయాలన్నారు. అంతేగాక వారిపై కెమికల్‌ క్యాస్ట్రేషన్‌ అమలు చేయాలని కూడా కోరారు.అత్యాచార కేసులపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు అన్ని జిల్లాల్లోను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండు చేశారు.