రేపు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: బోధనా రుసుముల చెల్లింపుల వివాదం కొలిక్కిరావడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగుమమైంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గఉపసంఘం భేటీలో భోదనాఫీజును రూ. 35వేలకు నిర్ణయించింది. దీనికి మెజారిటీ కళాశాలలు అంగీకారం తెలపడంతో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు  తెలిపారు.