రేపు ఇందిరమ్మ బాటను ప్రారంభించనున్న సీఎం

కాకినాడ: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం సీఎం రేపటి నుంచి
మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ బాట కోసం జిల్లాలో సీఎం 12 నుంచి పర్యటించాల్సి ఉండగా వర్షాల కారణంగా పర్యటన తేదీల్లో అధికారులు మార్పులు చేశారు.