రేపు నగరంలో ర్యాలీలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు మద్దతుగా రేపు నగరంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరనగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూడెమోక్రసీ కార్యకర్తల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద నుంచి, అక్కడి నుంచే 1.30కి తెలంగాణ జాగృతి కార్యకర్తల ర్యాలీ, విద్యుత్తు ఉద్యోగుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం సికింద్రాబాద్‌ మింట్‌కాంపౌండ్‌ వద్ద నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు ర్యాలీ, 12.30కి గన్‌పార్క్‌ వద్ద నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శన జరగనున్నాయి.