రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా రేఖ ఉప్పలయ్య ఎన్నిక
బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షీ): బయ్యారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రైతుబంధు సమితి మండల అధ్యక్షుని ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బయ్యారం మండలం రైతుబంధు సమితి మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి రేఖ ఉప్పలయ్య మీడియా ప్రతనిధులతో మాట్లాడుతూ ..తన మీద నమ్మకం ఉంచి మండల రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ గా పదవిని అప్పగించినందుకు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కు,మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత కు,జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్ కు , రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కు,జడ్పీ చైర్మన్ బిందు కు , ఎంపీపీ మౌనిక కు, వైస్ ఎంపీపీ మండల అధ్యక్షులు తాత గణేష్ కు, బయ్యారం మండల ప్రజాప్రతినిధులకు,నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన ఈ యొక్క బాధ్యతను, రైతులకి తగిన న్యాయం చేసి,తన వంతు బాధ్యత గా బయ్యారం మండల రైతులకి తగిన న్యాయం చేస్తానని, ఈ బాధ్యత ని అప్పగించిన పెద్దల గౌరవాన్ని కాపాడుతానని అన్నారు. .ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, బయ్యారం మండల యూత్ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యక్షులు రేపాకుల వెంకన్న,బయ్యారం టౌన్ అధ్యక్షుడు చాపల వెంకన్న, రామచంద్రపురం గ్రామ శాఖ అధ్యక్షులు తొట్టి కృష్ణ ,వార్డ్ మెంబర్ సుధాకర్, మండల నాయకులు చెరుకుపల్లి రవి, యూత్ మండల నాయకులు బైగల్ల వీరబాబు ఎస్సీ సెల్, రఘుపతి, రామారావు, 17 రెవిన్యూ గ్రామాల రైతుబంధు కోఆర్డినేటర్లు మండల నాయకులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.