రైతులను పట్టించుకొని అధికారులు

కాల్వశ్రీరాంపూర్‌ ,జూన్‌ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్‌,టీడీపీ,కాంగ్రేస్‌,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో విత్తనాలను రైతులకు అందించాల్సిన అధికారులు కేవలం వందల్లో విత్తనాల బస్తాలు ఇవ్వడం మండల అధికారులకు రైతులపై ఉన్న ప్రేమ కనబడుతుందని అన్నారు. కాగా స్థానిక ఎంపీడీఓ ఓబులేసు,ఏఏస్‌ఓ సురేందర్‌ రైతులకు కావాల్సిన విత్తనాలు అందిస్తామని హామి ఇచ్చారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు నిదానపురం దేవయ్య,కనకయ్య, శ్రీను, అజయ్‌,బండారి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.