రైతుల శ్రేయస్సుకోసమే.. : మంత్రి కన్నా

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో.. పంట విస్తీర్ణం 85శాతం మేర పెరిగిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు ఆ టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారులు ఫిర్యాదుదారుని ఎదుట ఉంటారని, సమస్యను పరిష్కరిస్తా రని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మబోరన్నారు. ఎనిమిదేళ్ల పదవి కాలంలో ఎన్నడూ రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. పదవి లేకపోవడంతో వారిపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు.