రైతుల సమస్యలు పట్టని పార్లమెంట్‌ !

share on facebook

మొన్నటికి మొన్న సాగుచట్టాలపై చర్చించలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సమస్యలపైనా చర్చకు అనుమతించడం లేదు. కనీసం ప్రకటన కూడా చేయడం లేదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సమస్యలు చర్చించని పార్లమెంట్‌ వల్ల ప్రజలకు ఏమటి ఉపయోగం అన్నది పాలకులు ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన నిలవాల్సిన బిజెపి ఇంతటి దౌర్భాగ్యంలోకి జారుకుంటుందని ప్రజలు బహుశా ఊహించి ఉండరు.సమస్య ఏదైనా కేంద్రంలో అధికారంలో ఉన్న  బిజెపి ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోంది తప్ప ప్రజల హితంలో చూడడం లేదు. అనేకానేక సమస్యలను ఇటీవల సిఎం కెసిఆర్‌ గట్టిగానే వెల్లడిరచారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంటారా కొనరా అని నిలదీసారు. ఇదే సందర్భంలో అనేక సమస్యలను ప్రస్తావించారు. ఎపి సిఎం జగన్‌ మాత్రం ఈ రకంగా ఎలాంటి డిమాండ్స్‌ చేయడం లేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. దన్నపోతు విూద వానపడ్డ చందంగా వ్యవహరించడం వల్ల నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు అన్న విషయం గుర్తించాలి. ధాన్యం కొనుగోళ్లపై చిన్న ప్రకటన చేసేందుకు కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. నిజానికి ఇది రాష్టాల్ర సమస్య కాదు. కెసిఆర్‌, మోడీ మధ్య ఉన్న సమస్య కూడా కానేకాదు. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే. ధాన్యం కొనుగోలు చేస్తే ప్రయోజనం పొందేది రైతులే. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై ఐదురోజులయినా ఏ ఒక్క సమస్యపైనా ప్రభుత్వం  స్పందించడం లేదు. నిజంగానే ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టత ఉంటే అదే విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా ఓ ప్రకటన చేయాలి. తాము చెప్పదల్చుకున్నది చెప్పాలి. ధాన్యం తెలంగాణ నుంచి ఎంత కొనేదా..ఏ రకంగా కొనేది..ఎంత మద్దతు ధరకు కొనేది చెప్పగలిగితే సమస్య చిటికెలో పరిష్కారం అవుతుంది. ప్రజలకు, రైతులకు కూడా నేరుగా తెలుస్తుంది. ఇందులో ఎవరి తప్పు ఏంటన్నది తేలుతుంది. కానీ అలా చేయడం లేదంటే ఇందులో మతలబబు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. కావాలనే కేంద్రం సమస్యను తప్పుదోవ పట్టింస్తుందా అన్న భావన కలుగుతోంది. ఎందుకంటే ఏడున్నరేళ్లయినా అనేక సమస్యలను బిజెపి నాన్చిందే తప్ప పరిష్కారానికి చొరవ చూపలేదు. ఇదేదో విదేశాలకు చేస్తున్న సాయంగా చూస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాళేశ్వరానికి జాతీయహోదా గుర్తింపు, నీటి వనరుల కేటాయింపు సమస్యకు చెక్‌ పెట్టడం, కొత్త ట్రైబ్యులన్‌ వేసి చర్చించడం, పోలవరం నిర్మాణం..విలీన మండలాల సమస్యలు, రాజధాని అమరావతి నిర్మాణం .. ఉద్యోగుల కేటాయింపు.. తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం వంటి సంస్థల ఏర్పాటు కావచ్చు… ఇవన్నీ కేంద్రం త్వరగా పరిష్కరించి ఉంటే అభివృద్ది వేగంగా జరిగేది. కానీ ప్రధాని మోడీ తొలినాళ్లలో ప్రకటించిన ఆదర్శాలు గంగలో కలిశాయి. ఆయన నేతృత్వంలో సమస్యలు పరిస్కారం అవుతాయా అన్న భరోసా లేకుండా పోయింది. ఏడున్నరేళ్ల కాలం  గిర్రున తిరిగిందే తప్ప ..కాలయాపన జరిగిందే తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిజానికి ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రలలను కూర్చోబెట్టి అభివృద్దికి ప్రణాళిక చేసివుంటే మోడీకి మరింత ఆదరణ పెరిగేదు. కేవలం సమస్యలను రాజకీయ  కోణంలో చూడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటులో ఇరు రాష్టాల్ర ఎంపిలు ఇంకా విభజన సమస్యలపై మాట్లాడాల్సి రావడం సిగ్గుచేటుగా భావించాలి. అంతెందుకు ఒక్క ధాన్యం సేకరణపై కేంద్రం ఏమనుకుంటుందో..ఏం చేయాలో కేంద్ర మంత్రి ఒక్క ముక్కలో చెప్పవచ్చు. కానీ ఎందుకనో చెప్పడం లేదు. గతంలో పసుపుబోర్డు విషయంలోనూ ఇలాగే దోబూచులాడారు. అలాగే అనేకానేక సమస్యలపై గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన మోడీ  ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. భారతదేశంలో గ్రామస్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కన్నప్పటికి ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని అర్ధ దశాబ్దం పాలించినా అది సాకారం కాలేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది. అందుకు పాలకులు నడుం బిగించాలి. ఆ దిశగా కార్యక్రమాలు చేయాలి. అయితే గ్రామాల్లో అలాంటి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు కనబడడం లేదు. దాదాపు అన్ని రాష్టాల్ల్రో సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా వ్యవసాయంతో సహా గ్రామాల వికాసానికి ఎలాంటి మార్పులు తీసుకోలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా  తయారయ్యింది. దీనికి ఉదాహరణ ధాన్యం సేకరణ. రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేస్తామన్న మోడీ ముందుగా దాన్యం సమస్యలపై దృష్టి పెట్టాలి. మద్దతు ధరలపై దృష్టి పెట్టాలి.  ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణులను పెంచి పోషించిన  రాజకీయాలకు కాంగ్రెస్‌ పెట్టింది పేరు. ఇలాంటి రాజకీయాలకు చరమగీతం పాడాలి. కానీ మోడీ అంతకుమించి నియంతృత్వ ధోరణఙలో సాగుతున్నారు. పార్లమెంటుకు రాకుండా చోద్యం చూస్తున్నారు. ఐదురోజులుగా ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు సాగుతున్నా పట్టించుకోవడం లేదు.  స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అన్ని సమస్యలకు సమాధానం చెప్పగలగాలి. నాయకుడు అన్నవాడికి ఈ లక్ష్యం ఉండాలి.  దేశంలో దాదాపు 70శాతం జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో అధికశాతం వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి  రికార్డు స్థాయికి చేరింది. అయితే రైతు సగటు వార్షికాదాయం మాత్రం పెరగడం లేదు. వ్యవసాయం గిట్టుబాటుకాక అధికశాతం రైతాంగం ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కొనే దుస్థితి నెలకొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. అద్భుతమైన ప్రకటనలు చేశారు. కానీ హావిూలు అమలు కావడం లేదు.  బ్యాంకులు వెనకంజ వేయడంతో రుణవితరణ లక్ష్యాలు నెరవేరలేదు. మూడు లక్షల రూపాయల దాకా ఇచ్చే స్వల్పకాలిక పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు నాలుగు శాతం వడ్డీకే అప్పులు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయినా సకాలంలో రుణాలు అందక రైతాంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొంటోంది.  వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు మరింత తక్కువ వడ్డీపై పంట రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తేనే పథకాలు సాకారం అవుతాయి. వ్యవస్థ బాగుపడాలన్న సంకల్పంతో ఉపయోగపడే పనులకు తొలి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సాగాలి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న  ఆరోపణల్లో నిజానిజాలు గమనించాలి. ప్రభుత్వాలు ఏర్పడటం, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ఆర్భాటాలు చేయడం, పథకాలను చివరికి పేపర్లకు అంకితం చేయడం మనం దశాబ్దాలుగా చూస్తున్నదే. జన సంక్షేమమే అంతిమ ఎజెండాగా పనిచేసే వారే నిజమైన పాలకులు అని మహాత్మాగాంధీ అన్నారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదొ బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని గద్దెనెక్కించేందుకు కాదని గుర్తు చేసుకోవాలి. ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంది.  ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో హావిూలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించి పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకుని సమస్య ఏదయినా పట్టించుకునే పరిస్థితిలోకి రావాలి. లేకుంటే ప్రజలు ఇంకా ఎంతోకాలం నమ్మరని గుర్తించాలి. రైతుల ఆగ్రహిస్తే ఏమవుతుందో అన్న పరిస్థితి అనుభవంలోకి వచ్చినా పట్టించుకోక పోతే మూల్యం చెల్లించుకో తప్పదనిగుర్తించాలి.

“““““““““““““`

గ్రామలు లక్ష్యంగా అభివృద్ది సాగాలి

కార్యక్రమాల అమలులో పోటీతత్వం రావాలి

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జనం సాక్షి):   గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇరు తెలుగు రాష్టాల్ల్రో అమలవుతున్న కార్యక్రమాలకు కేంద్రం చేయూతను ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హావిూల మేరకు నిధుల విడుదల జరిగితే సమస్యలకు పరిష్కారం దక్కగలదు. అయినా ఇరుష్టాల్ల్రో  చేస్తున్న కృషి మాత్రం అభినందనీయం. గ్రామాలను పరిపుష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు సాగుతున్న తీరు ఇరత రాష్టాల్రకు ఆదర్శం కావాలి. సీఎంలు ఇద్దరూ  బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలపై వరాల జల్లు కురిపిస్తున్న తీరు వారిని మచ్చిక చేసుకోవడానికే అన్న విమర్శలు సరికాదు. వారి బతుకులు బాగుచేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్న తీరుగా చూడాలి. ఎక్కడా విలువలు తప్పకుండా, పారదర్శకత విస్మరించకుండా అనేక పథకాలు సాగుతున్నాయి. బీళ్లు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, గొంతెం డుతున్న జనం కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకాలు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ. ఈ పథకాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు వచ్చే నిధులకు సమానంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అందుతున్నాయి. అంతటా ఒకేవిధమైన అభివృద్ధి సాగుతుంది. అంతటా గొలుసుకట్టు చెరువులన్నీ వరుసకట్టి అలుగుపోస్తున్నాయి.  వివిధ పథకాలు సమర్థవంతంగా అమలుచేయడానికి ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం కెసిఆర్‌ ప్రకటించారు.ఇలా గ్రామాలను ఆధారం చేసుకుని కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ది సాధ్యం. అందుకు తెలుగు రాష్టాల్రు ఆదర్శంగా మారితే అంతకు మించిన భాగ్యం మరోటి లేదు. కార్యక్రమాలు ఏవైనా, పేర్లు ఏవైనా ఇరురాష్టాల్ల్రో ఇంచుమించుగా అభివృద్ది కార్యక్రమాలు సాగుతున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు చేయూత,నీటి సంరక్షణ కార్యక్రమాలు జోరుగా సాగు తున్నాయి. అలాగే వ్యవసాయ పరిరిక్షణ ఉద్యమం కూడా సాగుతోంది. తెలంగాణలో కులవృత్తును బలోపేతం చేయడం అన్నది గ్రావిూణ అర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా గమనించాలి. పరిశ్రమల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకునే కన్నా మన వ్యవసాయ పరిశ్రమను బాగు చేసుకోవడం మంచిది. తెలంగాణలో నీటి లభ్యత తక్కువ. తాగడానికే నీళ్లు లేవు. ఇక సాగునీరు సంగతి సరేసరి. ఈ రెండు లక్ష్యాల కోసం తెలంగాణలో మిషన్‌ కాకతీయ,మిషన్‌ భగీరత కార్యక్రమాలు చేపట్టారు. వీటి ఫలాలను ప్రజలు అందుకుంటున్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తుంటే అప్పులు చేస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న వారు గతంలో వేలకోట్లు దుబారా గురించి మాట్లాడడం లేదు.  ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నేలంతా సస్యశ్యామలం చేస్తుంటే ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తున్నారని అవాకులు, చెవాకులు పేలుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా చెరువుల పునరుద్దరణ అన్నది పెద్ద ఎత్తున ఇరు రాష్టాల్ల్రో సాగుతోంది. వ్యవసాయానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. అందుకే కంది,మిర్చి, పసుపు పంటల దిగుబడి పెరిగింది. వరి ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఇవన్నీ అభివృద్ది కోణంలోనే చూడాలి. ధరలు దక్కకపోవడం, కొనుగోళ్లు లేకపోవడం అన్నది వేరు సమస్య.  అలాంటి ఆరోగ్యకర వాతావరణం ఇప్పుడు తెలుగునేలపై సాగుతోంది. తిపక్షనాయకులుగా రోజూ విమర్శించే వారితో పాటు ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అందరూ తమ నియోజకవర్గాల్లో సాగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇలాంటి అసమానతలు లేని విధానాన్ని రూపొందించడం వల్లనే గ్రామాలు అభివృద్ది చెందుతాయి.

Other News

Comments are closed.