రైతు బీమా నమోదుకు నేడే ఆఖరు
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాదికారి సిద్దిరామేశ్వర్ సూచించారు. రైతు బీమా నమోదుకు రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డ్
జిరాక్స్‌తో ఎడపల్లి, జానకంపేట్ గ్రామాల్లోగల రైతువేదికలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని ఏఓ సూచించారు. రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద గల దరఖాస్తును పూరించి, సంబంధిత జిరాక్స్ కాపీలను జాతచేయలని సిద్దిరామేశ్వర్ సూచించారు.