రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యంకోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా కృషి 

share on facebook

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మోసంనేటి ధర్నాలో అవకాశవాదాన్ని ఎండగడతాం: ఎమ్మెల్యే మహబూబ్‌నగర్‌,నవంబర్‌11(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరు దారుణమన్నారు. విభజన చట్టంలో అన్యాయం జరిగినా బిజెపి నేతలు మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా? కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఓవైపు ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో కాకుండా ఢల్లీిలో ధర్నా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. ఆ పార్టీ నేతలు అబద్దాలు చెప్పి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతల మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దన్నారు. వడ్లు తాము కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు. మేనిఫెస్టోలోలేని అంశాలను కూడా సీఎం నెరవేరుస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో విపక్షనేతలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే నేతలు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరి ప్రచారాలను ప్రజలు నమ్మరని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న తపనతో పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి, నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆనందం కోసమే నిరంతరం పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి చెరువు నిండాలి, ప్రతి ఎకరం పండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. ఈ క్రమంలో ధాన్యాగారంగా తెలంగాణ అవసరతిస్తే  పండిన ధాన్యం కొనడానికి కూడా ఏంద్రం కొర్రీలు వేయడం వల్ల 12న ధర్నాలకు దిగాల్సి వస్తోందని అన్నారు.  దేశంలో రైతుల గురించి ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, అందుకే రైతురాజ్యం తేవాలనే అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్నారు. పెండిరగు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామని, పంటలకు పెట్టుబడి ఎవరి ముందు చేయి చాచకుండా ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నామన్నారు. రైతు మరణిస్తే రూ.5లక్షలు బాధిత కుటుంబానికి అందేలా చేసింది కేసీఆర్‌ సర్కారే అన్నారు.  పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలకు కాంగ్రెస్‌, టీడీపీలే కారణమన్నారు.  రైతులు బాగు పడితేనే పల్లెలు బాగుపడతాయని, పల్లెలు బాగుపడితే రాష్ట్రం బాగు పడుతుందన్నారు.

Other News

Comments are closed.