రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ధర్నా

కర్నూలు, జూన్‌ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రైతు రాజ్యం కోసం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి చెందే నాటికి ఆయన మనసులో రైతు సమస్యలే అధికంగా పరిష్కరించారని అన్నారు. ఆయన మరణాంతరం ప్రభుత్వాని నిలుపుకోలేక జగన్‌పై దుష్ప్రచారం చేయడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సబ్సిడీపై, నకిలీ విత్తనాల, ఎరువులపై కొరడ ఝుళిపించాలని ఆయన కోరారు.