రైళ్లలో త్వరలో పర్యావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు

పంజాబ్‌: రైళ్లలో త్వరలో పర్వావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు (బయో టాయ్‌లెట్లు) రానున్నాయి. ఇప్పటికే కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా వీటిని పరీరక్షించి చూసిన రైల్యే మరిన్ని రైళ్లలో వీటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోచ్‌లలో వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కోదానికి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం రైళ్లలో ఉన్న మరుగుదొడ్లలోంచి వ్యర్ధాలను బయటకు వదిలేస్తుండడం వల్ల తీవ్ర దుర్గంధం, పర్యావరణ సంబంధమైన ఇబ్బందులతోపాటు రైలు పట్టాలు తరచు తుప్పుపట్టిపోతున్నాయి. రైల్వేకు ఈ తుప్పు వల్ల వాటిల్లుతున్న నష్టమే ఏడాదికి 350 కోట్ల రూపాయల వరకు ఉంటోంది. ఇలాంటి నష్టాలన్నీ నివారించే ఉద్దేశంతోనే బయో టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాలని రైల్వే నిర్ణయించింది.