రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ద్వారకా తిరుమలకు వెళ్తున్న ఒక లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి లారీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దానితో లారీ డ్రైవర్‌, పక్కన కూర్చున క్లీనర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగంగా పూర్తి ధ్వంసమైంది. అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.