రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అగి ఉన్న లారీని వెనక నుంచి వ్యాను ఢీకొనడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.