లక్కపురుగులను నివారించాలని రాస్తారోకో

పెద్దపల్లి: రాఘవపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంల నుంచి లక్కపురుగుల గ్రామానికి వ్యాపిస్తున్నాయంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. లక్కపురుగులను నివారించాలని కోరుతూ ఈ రోజు పెద్దపల్లి, మంథని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మూడు గంటలపాటు గ్రామస్థులు ఆందోళన చేశారు. పెద్దపల్లి బసంత్‌నగర్‌ పోలీసులు గ్రామస్థులకు సర్ధిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.