లక్ష్మీనరసింహ ఆలయం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: మంత్రి దనాం నాగేందర్‌ నిన్న వీరంగం సృష్టించిన బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హరేకృష్ణ మూప్‌మెంట్‌ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజుపై నిరసిస్తూ మంత్రి నిన్న ఆలయానికి తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు నేడు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ జరిగే వేడుకల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.