లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మెగా కార్యక్రమం

కరీంనగర్‌:(టౌన్‌) లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థినీలకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మీతసభర్వాత్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణా ప్రాంతాల్లో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాలు ఉన్న పాఠశాలలకు వెళ్లటానికి వీలుగా 35సైకిల్లు పంపిణీ చేశారు. కరువు మండల చిన్నకారు రైతులకు హైండ్‌ పవర్‌ స్ప్రే పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో లయన్స్‌ క్లబ్‌ ద్వారా కంటి ఆపరేషన్‌లు, లక్షకు పైగా చేసి రికార్డ్‌ల పర్వం మొదలు పెట్టారని రానున్న రోజుల్లో అందరికి విద్యా, వైద్యం, ఆరోగ్యం కార్యక్రమాలకు చేదోడుగా లయన్స్‌ క్లబ్‌ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.