లాడెన్ కూడా
..ఇస్లామాబాద్ : ప్రభుత్వ లంచావతరాల నుంచి సామాన్యులే కాదు అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్ సైతం తప్పించుకొనేందుకు స్థాని రెవెన్యూ అధికారికి రూపాయాలు 50వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. లాడెన్ డైరీ ద్వారా ఈ విషయం బయటపడినట్లు ”జంగ్” పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అబోటాబాద్ లోని పాకిస్తాన్ సైనిక అకాడమమీ సమీపంలో లాడెన్ మూడంతస్తుల ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం స్థానిక పట్వారీకి రూపాయలు 50వేలు సమర్పించుకున్నడు. గతేడాది మే2న అమెరికా
నావికా దళం ”సీల్స్” ఈ ఇంటిపై నిర్వహించిన దాడిలో లాడెన్ హతమయ్యాడు. ఇంట్లో లాడెన్ రాసిన డైరీతోపాటు 1,37,000పత్రాలు లభించాయి. ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూపాయాలు 50వేలు లంచం ఇవ్వాల్సి వచ్చినట్లు అతడు తన డైరీలో రాసుకున్నాడు. లంచం తీసుకున్న పట్వారీని దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. లంచం ఇచ్చిన వ్యక్తి లాడెన్ అనే విషయం పట్వారీకి తెలియదని వెల్లడైంది.