లెండీ ప్రాజెక్టును సందర్శించిన ఎస్‌ఈ

మద్దూరు: మండలంలోని లెండీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను ప్రాణహిత -చేవెళ్ల సర్కిల్‌ ఎన్‌ఈ శ్రీరామ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనతరం లెండీ క్యాంపు కార్యాలయంలో మహారాష్ట్ర, ఆంధ్ర ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 545 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లెండీ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.775 కోట్ల వ్యయం కావచ్చని అన్నారు. ప్రాజెక్టు వలన 12 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని వాటిలో మూడు గ్రామాలకు మహారష్ట్ర పునరావాసం కల్పించకపోవడంతో లెండీ ప్రాజెక్టు సకాలంలో పూర్తికావట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ సాయిబాబా, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ గోవర్ధన్‌రెడ్డి, మహారాష్ట్ర లెండీ ప్రాజెక్టు డీఈ కోటిల్వార్‌ తదితరులు పాల్గొన్నారు.