వంశధారలో పెరిగిన నీటి ప్రవాహం
హిర: వంశధార నదిలో ఆదివారం సాయంత్రం స్వల్ప స్థాయిలో నీటి ప్రవాహం పెరింగింది. నది క్యాచ్‌మెంట్ ఏరియా అయినా ఒరిస్సా ప్రాంతాలో 72 మిలీమీటర్ల వర్షపాతం నమోద కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. సుమారు ఇన్‌ఫ్లో సుమారు 8,000 క్యూసెక్కులు నమోదుకాగా సాయంత్రానికి అది 11,500 క్యూసెక్కులకు చేరింది. బ్యారేజీలో నిల్వఉన్న నీటిని ఎడమకాల్వకు 1200 క్యూసెక్కులు, కుడి కాల్వకు 120 క్యూసెక్కులు నీరు వదిలినట్లు అధికారులు తెలియజేశారు.