వంశధార కుడి కాలువకు నీరు నిలుపుదల

శ్రీకాకుళం, జూలై 22 : వంశధార కుడి ప్రధాన కాలువకు నీరు నిలుపుదల చేసినట్లు గొట్టాబ్యారేజి కార్యాలయం అధికారులు తెలియజేశారు. ఎడమకాలువ ద్వారా 526 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. నదిలోకి ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు నమోదైందన్నారు. ఇన్‌ఫ్లో నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. వంశధార నదీ పరివాహక ప్రాంతం ఒడిశాలో కుట్రగడ, గుడారి, మోహన, మహేంద్రగడ, గుణుపూర్‌, కాశీనగర్‌ ప్రాంతాల్లో 201 మిమీ, హిరమండలంలో 30.80 మిమీ వర్షపాతం నమోదైందన్నారు. గొట్టా బ్యారేజి వద్ద 37.52 మీటర్ల లెవల్‌ నీటి మట్టం ఉందన్నారు. కుడి కాలువ పరిధిలో నీరు అవసరమైనంత ఉన్నందున నీరు నిలుపుదల చేసినట్లు ఆయన తెలిపారు.