వచ్చే ఎన్నికల్లోపు పార్లమెంటులో లోక్‌పాల్‌ బిల్లు పెట్టాలి.

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు లోక్‌పాల్‌ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించారు. సీఎస్‌ఎస్‌ ఐబీఎస్‌ ఛానల్లో కరణ్‌ ధాపర్‌ నిర్వహించిన డెవిల్స్‌ అడ్వొకేట్‌ కార్యక్రయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోపు మాత్రం పార్లమెంటు లోక్‌పాల్‌ చట్టాన్ని తీసుకువస్తుందన్నారు. ఇటీవల ప్రధాని కార్యాలయం అన్నాకు రాసిన ఉత్తరం గురించి ప్రస్తావిస్తూ అన్నా బృందం దానిని విప్పి చదవకుండా నేరుగా ఆయనకే అందించి ఉంటే హుందాగా ఉండేదని పేర్కొన్నారు.