వరంగల్ చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

వరంగల్ ఈస్ట్, డిసెంబర్ 09 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం 28వ డివిజన్ లో కొండా దంపతుల ఆదేశాల మేరకు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి రవీందర్,డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి కురిమిల్ల సంపత్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాంబులు కాల్చి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ ప్రవలిక , ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు గజ్జెల ఉమేష్ ,జలంధర్ ,వలబోజు శ్రీనాథ్ , సాయిల్ ,కుసుమ రమేష్ , వరంగంటి రాము ,హేమంత్ మాటేటి నవీన్ , రమేష్ , శ్రీనివాస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు కొండా అభిమానులు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయడం జరిగింది.