వర్గీకరణ కోసం కలెక్టరేట్ల ఎదుట ఆందోళన : మందకృష్ణ
సికింద్రాబాద్, మార్చి 20 : ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 23 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. 27న మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.