వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు

నిజామాబాద్‌: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. భారీ వర్షాలకు ఆవులు మృతి చెందిన బాధితులకు ప్రభుత్వ రాయితీ పథకం కింద రుణాలిప్పిస్తామన్నారు.