గాంధేయ మార్గమే ఆదర్శం

` యుద్ధంతో సాధించేది లేదు
` ప్రజలతో మమేకమై పనిచేయండి
` తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు
` అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం
` ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్
` 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
` 124 ఆయుధాలు అప్పగింత
` దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్
` గణపతిజీ వచ్చేయండి
` సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్(జనంసాక్షి):శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తాం. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి. లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైన వసతులు కల్పిస్తాం అని అన్నారు. 130 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’ మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు తీవ్ర కషిచేశారు. పోలీసులు మావోయిస్టుల్లో నమ్మకం కల్పించారు. దేవ్‌జీ, ఆయన మిత్రబందం కొన్ని ప్రతిపాదనలు చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారు’. ªSష్ట్ర స్థాయిలో మేం చేయగలిగిందంతా చేస్తాం. మావోయిస్టు అగ్రనేత గణపతి కూడా లొంగిపోవాలి. అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన ఏడుగురు కూడా.. త్వరగా లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించాలని అమిత్ షా చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు కూడా అందజేస్తాం. ప్రత్యేకమైన ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తాం’ అని రేవంత్ రెడ్డి హావిÖ చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తాం. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం
సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో ఉన్నవాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అందరూ కలిసి వస్తే, తెలంగాణ పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. “ గూడేలు, తండాల్లో ఉన్నవారి మెరుగైన జీవితానికి కషి చేద్దాం. ఆదివాసీ, గిరిజనుల ఆర్థికస్థోమత పెరిగేలా మేం కషి చేస్తున్నాం. మావోయిస్టులపై ఎత్తివేయగల కేసులు ఉంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది. చట్టపరంగా ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం. తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తివేసినా.. కోర్టులు ఊరుకోవు. వ్యక్తులు, వారిపై ఉన్న నేరాల తీవ్రతనుబట్టి పరిశీలిస్తాం. లొంగిపోయిన వాళ్లు రాజకీయాల్లోకి వస్తామన్నా.. స్వాగతిస్తాం. కొందరు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజా ప్రతినిధులు అయ్యారు. సీతక్క లాంటి వాళ్లు రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లు పీసీసీని కలిసి ఆసక్తి తెలియజేయవచ్చు” అని రేవంత్ అన్నారు.
లొంగిన వారికి హోదాను బట్టి నగదు ప్రోత్సాహకం
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు ముందు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి పోలీసులు ఇప్పటి వరకు 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 7 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. 124 తుపాకులు, 5205 తూటాలతో సహా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. మావోయిస్టులు సరెండర్ చేసిన ఆయుధాలలో రైఫిళ్లు ఇతర తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు. ఇక, లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.తెలంగాణ ప్రభుత్వం జనజీవన స్రవంతిలో కలిసిపోయిన డివిజనల్ కమిటీ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు నాలుగు లక్షల రూపాయలు, పార్టీ సభ్యులకు లక్ష రూపాయలు నగదు బహుమతి ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలుస్తున్న క్యాడర్లకు అదనంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి.

మహిళల భద్రతే తొలి ప్రాధాన్యత
` వారి కోసం ఎన్నో చట్టాలు తెచ్చాం
` ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు అమలు
` మహిళా వేధింపులను నిలదీసే సమాజం రావాలి
` స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సిఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ’స్టాండ్ విత్ హర’ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. వారు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చాం. మహిళలపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. వారి ప్రాధాన్యం గుర్తించి పార్టీలో పదవులు ఇస్తున్నాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు. గ్రావిÖణ ప్రాంతాల్లోని మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. సోషల్ విÖడియాలో మహిళలను వేధించే ఘటనలు తాజాగా పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భహంగా మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ’స్టాండ్ విత్ హర’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళా నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలను శక్తితో పోలుస్తామని.. కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతో పోలుస్తామని సీఎం తెలిపారు. మహిళలకు వేధింపులు.. పట్టణాలు, కాలేజీలు, పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని.. సోషల్ విÖడియాలో మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ’మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలని సీఎం సూచించారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తే బాధ్యత తీరిపోయిందని అనుకోవడం తప్పని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డులు అన్నీ మహిళల పేర్లవిÖద ఇస్తోందన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళలు అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి స్వేచ్ఛ పెరిగిందని సీఎం తెలిపారు. జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించి మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు ఇచ్చామన్నారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ సహా కీలక అధికార పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదే అని అన్నారు. మహిళల శక్తి, నైపుణ్యంపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.మహిళల రక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందన్నారు. అభివద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే నిలబడి ప్రశ్నించే ధైర్యం సమాజంలో రావాలన్నారు. కాలేజీలు, బస్టాండ్లు సహా ఎక్కడైనా జరిగే వేధింపు లను చూసీ చూడనట్టు ఉండడం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అని అన్నారు. సోషల్ విÖడియా ద్వారా మహిళలపై సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, సినీ నటుడు సాయి దుర్గతేజ్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చాలి
` ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే
` క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
` కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి
మున్సిపల్ కమిషనర్లతో సవిÖక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సవిÖక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్టిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కష్ణారెడ్డి, హెచఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి..
` 30 వరకు నిర్వహణ.. నోటిఫికేషన్ జారీ
` ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించున్న గవర్నర్
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 11.45 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.