వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్

హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వలసపోవడంపై టీపీసీసీ, సీఎల్పీ సీరియస్‌గా తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో, వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటనే అంశాలపై పార్టీ సీనియర్లతో చర్చించాలన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టి సారించాలని కోరారు.