వాధ్యులు ప్రబలకుండా చర్యలు

శ్రీకాకుళం, జూలై 31 : ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం మండల అభివృద్ధి అధికారి వెంకట్రామన్‌ అన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్ననకు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పంచాయతీ కార్యదర్శులతో ఆయన తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వాహణపై ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కొత్త నీరు వల్ల వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని, అందువల్ల తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఈసమావేశంలో పంచాయతీ విస్తరణ అధికారి చక్రధరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ డి.హేమలత, తదితరులు పాల్గొన్నారు.