వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాం : కోదండరాం

హైదరాబాద్‌ నవంబర్‌ 14, (జనంసాక్షి) :

వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని నాగం జనార్ధన్‌రెడ్డి చేపడుతున్న భరోసాకు యాత్రకు తాము మద్దతు ఇస్తున్నామని  తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆయన బుధవారం జేఏసీ కార్యలయంలో నాగంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కాంగ్రెస్‌ నేతలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి గీతారెడ్డిపై చేసినట్లుగా ఓ పత్రిక వక్రీకరించిందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. తాను గీతారెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పత్రికలో వచ్చిన వార్త తీరు తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆ వార్త వల్ల మనస్తాపం కలిగితే గీతారెడ్డికి, దళిత సంఘలకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.