వికలాంగులను మోసం చేస్తోన్న ప్రభుత్వం

శ్రీకాకుళం: జిల్లాలో సదరం పేరుతో వికలాంగులను మోసం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు 80 శాతం అంగవైకల్యంతో కంటికి కనబడుతున్న వికలాంగులను పింఛన్లకు దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కంటికి కనబడుతున్న అంగవైకల్యాన్ని చూసిన వెంటనే నేరుగా వికలాగులుగా గుర్తించే చర్యలు తీసుకోవాలని పూచించారు శ్రీకాకుళం మున్సిపాలిటీలో రూ. కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని అలాంటి కబ్జాకోరులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈసమస్యలపై శ్రీకాకుళం కలెక్టరెట్‌ లో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ ఎస్‌ రాజ్‌కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.