విజయనగరం జిల్లాలో ర్యాగింగ్‌: ఆసుపత్రి పాలైన విద్యార్థిని

విజయనగరం: గొట్లాంలోని గాయత్రి కళాశాల వసతి గృహంలో జరిగిన ర్యాగింగ్‌లో షామిలి అనే ఇంటర్‌ విద్యార్థిని ఆసుపత్రి పాలైంది. షామిలి అందంగా ఉందంటూ తోటి విద్యార్థినులు ఆమెను హింసించారు. గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను విశాఖ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 19న ఈ సంఘటన జరిగింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది.