విదేశీగడ్డపై ఆత్మీయ అతిథి
` ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్‌ను కలిసిన ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్..
హైదరాబాద్,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పారిస్ వెళ్లిన కేటీఆర్‌ను ఓ ఆత్మీయ అతిథి కలిశారు. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్.. ఆ అనుకోని ఆత్మీయ అతిథి. ఫ్రెంచ్ యూనివర్సిటీకి చెందిన ‘‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాషపై చేస్తున్న పరిశోధనకు సంబంధించిన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. వేల మైళ్ళ దూరాన ఉండి కూడా తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకమన్న కేటీఆర్.. నెగర్స్‌ను ప్రశంసించారు.