విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మయన్మార్‌ పార్లమెంట్‌ ఆమోదం

యాంగాన్‌: దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు మయన్మార్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈబిల్లు నుంచి 5 మిలియన్‌ డాలర్ల కనీస పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించారు. ఐదు దశాబ్దాల మిలటరీ పాలన అనంతరం గత సంవత్సరం బాధ్యతలు స్వీకరించిన కొత్త ప్రభుత్వం.. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లును రూపొందించింది.