విద్యార్థిసంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్: వికలాంగుల సమస్యల పరిష్కారానికి మందకృష్ణ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలు విద్యార్థి, హక్కుల సంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి బయలుదేరిన ఎంఎస్‌ఎఫ్, టిఎన్‌ఎఫ్‌ఎఫ్, వీహెచ్ పీఎన్, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. వికలాంగుల కోసం మందకృష్ణ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా స్పందించకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.



