విద్యార్ధి మృతి

హైదరాబాద్‌: తప్పిపోయిన విద్యార్ధి విశాల్‌ జిల్లెలగూడ చెరువులో శవమైకన్పించాడు. మీరపేటలోని తిరుమలనగర్‌కు చెందిన విశాల్‌ మూడరోజుల క్రితం అదృశ్యమైట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేసి వెతుకుతుండగా ఈ రోజు చెరువులో శవంగా తేలాడు. విశాల్‌ను 15 రోజుల క్రితమే కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేయాగా తప్పించుకుని ఇంటికోచ్చాడు. ఇప్పుడు ఈ విధంగా మృతి చెందటం అనేక అనుమనాలకు తావిస్తోంది.