విద్యుకోతలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై నిరసనల వెల్లువ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుగుదేశం, వామపక్షాలు సచివాలయాన్ని ముట్టడించాయి. టీడీపీ,వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ విద్యుత్‌సౌధను విడతల వారిగా ముట్టడిస్తున్నారు. పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహెందర్‌రెడ్డి, రత్నంలను అరెస్ట్‌ చేశారు. విద్యుత్‌సౌధవద్ద ధర్నాతో ఖైరతాబాద్‌ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.