విద్యుత్తు కోతలు నిరసిస్తూ రైతుల ధర్నా

మల్లాపూర్‌: పంటలకు రాత్రి పూట కరెంటు ఇవ్వటాన్ని నిరసిస్తూ మల్లాపూర్‌ సభ్‌స్టేషన్‌ ఎదుట 400 మంది రైతులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను ముట్టడించటంతో పాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌, గొర్రెపల్లి, కుత్తాపూర్‌, రత్నాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.