విద్యుత్తు సంక్షోభం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది : మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్: విద్యుత్తు సంక్షోభం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని మంత్రి గీతారెడ్డి అన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది, పెట్టుబడుల అంశంపై అధికారులతో మంత్రి గీతారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో వచ్చే ఉద్యోగావకాశాల్లో 80 శాతం మేర స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.