విద్యుత్ కొరత నివారించే మార్గాలను ముఖ్యమంత్రికి సూచించాను: రామచంద్రయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని దీన్ని నివారించే మార్గాలే తాను ముఖ్యమంత్రికి సూచించినట్టు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. సచివాలయంలో ఆయన సీఎంతో సమావేశమయ్యారు. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలను సీఎంకు రాసిన లేఖలో వివరించినట్టు రామచంద్రయ్య వెల్లడించారు.