విద్యుత్‌ ఛార్జీలతో దగా. రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు స్వల్పంగానే పెంచామని నమ్మబలుకుతూ పరోక్షంగా ఎఫ్‌ఎన్‌ఏ రూపంలో ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థలు మోసపూరిత వద్దతుల్ని అవలంభిస్తోంటే సంబంధిత కమిషన్‌ అభ్యంతరం తెలుపకుండా ఆమోదిస్తోందని విమర్శించారు. ఈనెల 16న బహిరంగ విచారణకు ముందుగానే ప్రభుత్వం తరుపున కమిషన్‌కు తెలియజేయాలని కోరారు.