విద్యుత్ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
విజయనగరం: జిల్లాలోని కొత్తవలస మండలం కొత్తసుంకరపాలెంలో శారద పరిశ్రమలో నిర్వహిస్తున్న విద్యుత్‌లైన్ పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి 30మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య విద్యుత్‌లైన్ పనులను పరిశ్రమ సిబ్బంది చేపడుతున్నారు.