విద్యుత్ సమస్య తీర్చటం చేతకాక పోతే విద్యుత్ బోర్డ్ మాకు అప్పగించండి:టీడీపీ
హైదరాబాద్: విద్యుత్ సమస్య తీర్చటం చేతకాక పోతే విద్యుత్ బోర్డ్ మాకు అప్పగించండని టీడీపీ నేత ఎర్రబెల్లి దయకర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి సోమవారందాకా సమయం ఇస్తున్నామని ఈ లోగ విద్యుత్ సమస్య పరిష్కరించకపోతే ముఖ్యమంత్రిని నిర్భందిస్తామని అన్నారు. తీవ్ర పరిణామాలుంటాయని వాటికి మా బాధ్యత ఉండదని రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు విదించటం వల్ల రైతులు రోడ్డుపై పడ్డారని కనీసం 7గంటల విద్యుత్ ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావటం లేదని అన్నారు.