విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: ఏగుగంటల విద్యుత్‌ సరఫరా హామీ అమలు చేయకపోవడాన్ని నిరిసిస్తూ తెరాస ఎమ్మెల్యేల బృందం విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. గతంలో ఇచ్చిన హామి అంశంపై చర్చించేందుకు ఇవాళ తెరాస ఎమ్మెల్యేలు సీఎండీ కార్యాలయానికి వచ్చారు. ఆసమయంలో సీఎడీ లేకపోవడంతో అక్కడే  బైఠాయించారు.గతంలో ఇచ్చిన హామీని అమలు చేసే వరకూ తమ నిరసన ఆగదని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల రాకతో విద్యుత్‌ సౌధ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, రాజయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఆందోళనలో పాల్డొన్నారు.