విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి

శాయంపేట (జనంసాక్షి, జూన్‌ 16) : శాయంపేట మండలం నేరడుపల్లి శివారు అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన వంగరి శ్రీకాంత్‌ (18) శుక్రవారం సాయంత్రం సమయములో విద్యుత్‌ వైరు తగిలి మృతి చెందినట్లు శాయంపేట ఎస్‌.ఐ. నాగబాబు తెలిపారు.  ఎస్‌.ఐ. కథనం ప్రకారం శుక్రవారం రోజున సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో బజారు నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇంటి ముందు ఉన్న జె వైరు ప్రమాదవశాత్తు వంగరి శ్రీకాంత్‌ మెడ భాగములో తగిలి కరెంటు షాక్‌కు గురి కాగా కుటుంబ సభ్యులు 108లో ఎం.జి.ఎం.కు తరలించగా మార్గమధ్యలోనే శ్రీకాంత్‌ మృతి చెందినట్లు శాయంపేట ఎస్‌.ఐ.నాగబాబు తెలిపారు.