విధి నిర్వహణలో కానిస్టేబుల్‌ మృతికర్నూలు

జూన్‌ 12 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ (55) వడదెబ్బకు మృతి చెందినట్లు పోలిస్‌వర్గాలు తెలిపాయి. పాములపాడు పోలిస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌లు ఉప ఎన్నికల విధి నిర్వహణ నిమిత్తం ఆళ్లగడ్డలో విధుులు నిర్వహిస్తూ వడదెబ్బతీవ్రతకు కుప్పకూలిపడిపోయి మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.