విధులు సక్రమంగా నిర్వర్తించని యడల ఇంటికే… సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక

కందుకూరు ,జూలై 24,: విధులు సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించని యడల ఇంటికే అని సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమంలో విఆర్‌ఓల హాజరు తక్కువగా ఉండటంతో ఎక్కడికి వెళ్లారని వాకబు చేశారు. అదే విధంగా మాచవరం గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది పురమాయించిన పనులు చేయనందున వారిని కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై స్థాయి అధికారి పనిచెప్తే చేయరా జిల్లా స్థాయి అధికారులకు మేము ఏం సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. మరోసారి ఈ విధంగా బాధ్యతా రహితంగా విధులు నిర్వర్తించిన యడల సస్పెండ్‌ చేస్తూ కాగితాలు చేతిలో పెడతానని తీరికగా ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.