విధుల్లో అడుక్కునే ఆర్టిస్ట్ నాగయ్య కు ఆర్థిక సహాయం అందించిన మంత్రి కే టి అర్ గురించి

to5c60x5

విధుల్లో అడుక్కునే  ఆర్టిస్ట్ నాగయ్య గురించి తెలుసుకొని చలించిపొఇ వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన మంత్రి కే టి అర్ గారికి అభినందనలు ! నాగయ్య ను చూసి ఐన సినిమా పరిశ్రమలో సామాన్యుల పరిస్థితి క్లియర్ గ అర్థం అయి ఉండవచ్చని  భావిస్తున్నను. గత ప్రభుత్వాలు బడ బాబులతో ఒప్పందాలు కుదుర్చుకొని సామాన్యుల గురించి పట్టిచుకోనందుకే నాగయ్య లాంటి వాళ్ళకు ఈ స్థితి పట్టింది . రెగ్యులర్గ లో బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలకు ప్రోత్సాహకాలు అందజేస్తే కానీ కళాకారులకు పని దొరకదు . దాన ధర్మాలు చేసి ఆదుకునే కంటే బ్రతుకు తెరువు మార్గాలు చూపిస్తే నే మంచిది . నగయ్యలాంటి యెంత మందిని ఆర్థిక సహాయం అందచేసి అదుకోగలదు ప్రభుత్వం ? ఒక మెరుగైన సినిమా పాలసీ ని ప్రవేశ పెట్టితే కళాకారులూ యిట్లాంటి దీన స్థితికి దిగజారరు కదా ! కళాకారులూ దయ దక్షణలు తీసుకునే బదులు విరారాలు ఇచే స్థాయికి ఎదుగుతారు ! కాబట్టి మంత్రి కే టి అర్ గారి చలించిన మనసు ద్వార నైన మన ప్రభుత్వం కళ్ళు తెరిచి బంగారు తెలంగాణా నిర్మాణంలో భాగంగా సామాన్య సినిమవాల్ల ఎదుగుదల పై దృష్టిసారించి ఒక ఉజ్వల భవిషత్తు ప్రసాదిస్తుందని నమ్ముతున్నాము  !

– రఫీ ( దర్శక నిర్మాత )