విధుల్లో చేరిన ఫ్లయింగ్‌ ఆఫీసర్ల బృందం

హైదరాబాద్‌:భారత రక్షణ దళాల్లోకి మరో 216 మంది ఆఫీసర్ల బృందం ఈరోజు ఆధికారికంగా విధుల్లో చేరింది.హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్‌లు భారతీయ వాయుసేన ప్రధానాధికారి ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఏకే బ్రౌనే సమక్షంలో వాయుసేనతోపాటు ఇతర సైనిక విభాగాల్లో చేరారు.ఫైలట్‌,గ్రౌండ్‌ డ్యూటీ నేవిగేషన్‌ కోర్టుల్లో శిక్షణ పొందిన ఈ యువ ఆధికారుల బృందం గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ దుండిగల్‌ ఎయిర్‌ఫొర్స్‌ అకాడమీలోని ఎయిర్‌ఫీల్డ్‌లో కన్నులపండువగా జరిగింది.నౌకాదళం,కోస్టుగార్డు విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని మాతృవిభాగాల్లో సేవలందించనున్నారు.శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బ్రౌనే ప్రశంసాపతకాలు అందించారు.క్యాడెట్లు హక్‌ విమానాలు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.తరువాత ఏఎస్‌-32 డార్నియర్‌ విమానాలు,కిరణ్‌ శ్రేణి విమానాలు విన్యాపాలు చేపి అలరించాయి.