వినాయక నవరాత్రి ఉత్సవాల పై నిర్లక్ష్యం ఎందుకు
బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు భాస సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
ఈనెల 31 నుండి వినాయక నవరాత్రిఉత్సవాలు, ప్రారంభమవుతున్న దృష్ట్యా నిమజ్జన , నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు సజావుగా జరగడానికి నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేయాలని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు భాస సత్యనారాయణ డిమాండ్ చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు , నిర్వహణపై నగరపాలక సంస్థ అలసత్వాన్ని నిరసిస్తూ బిజెపి కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ లోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల మండిపడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు . నగరంలోని అనేక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు . దీంతో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి , మంటప ఏర్పాట్లకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. నిమజ్జన కార్యక్రమానికి తరలివచ్చే వినాయకులకు స్వాగతం పలికే టవర్ సర్కిల్ చుట్టూ ప్రాంతాల్లోని రహదారులు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయని , నిమజ్జనానికి వినాయక ప్రతిమలతో టవర్ కు తరలి వచ్చే ప్రధాన రోడ్లన్నీ సరిగా లేవని , మున్సిపల్ యంత్రాంగం దీనిపై దృష్టి సారించి , పనులు సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు . వినాయక నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వినాయక పండుగ సమయంలోనే పట్టణంలోని చాలా ప్రాంతాల్లో రహదారులను, మురికి కాలువలను అభివృద్ధి చేయడం కోసం పనులు ప్రారంభించి రహదారులు మూసి వేయడం సరికాదన్నారు. హిందువుల ప్రథమ దైవమైన వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగే విషయంలో మున్సిపల్ యంత్రాంగం నేటికీ ఎలాంటి ఆలోచన చేయకపోవడం , అందుకు తగిన చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు . ఈ మేరకు బిజెపి కరీంనగర్ అసెంబ్లీ ,పట్టణంలోని వివిధ జోన్ల పక్షాన మున్సిపల్ కమిషనర్ కు సమర్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో జూన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నరహరి లక్ష్మారెడ్డి ,ఔదుర్తి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి తణుకు సాయి కృష్ణ ,పొన్నం మొండయ్య గౌడ్, మామిడి రమేష్ ,మండల అధ్యక్షులు రతన్ కుమార్ ,జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ జాడి బాల్ రెడ్డి బిసి మోచ రాష్ట్ర నాయకులు ఎన్ ఎం ప్రకాష్ ,మంతిని కిరణ్ బొంతల చంద్ర, నాంపల్లి శ్రీనివాస్, మామిడి చైతన్య ,దేవి శెట్టి నవీన్, శ్రీరాములు, నేదునూరి అనిల్, కైలాస్ నవీన్ ,నిఖిల్,ఉమ మహేశ్వర్ ఈస్ట్ జోన్ ప్రధాన కార్యదర్శి, బెల్లం నరేందర్ కార్యదర్శి, కిసాన్ మోర్చ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు కుంటల
మధు , వనం హరి, లడ్డు ముందడ, మైపాల్ రెడ్డి, అన్వేష్, రాజేష్,పశ్చిమ జోన్ ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, న్యాల కొండ ప్రసన్న రెడ్డి , జోన్ ఉపాధ్యక్షులు ఎడమ సత్యనారాయణరెడ్డి, ఎం లక్ష్మీరాజు జోన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు, గాదగోని రమేష్ యు మోర్చాజోన్ అధికార ప్రతినిధి, గోలి సత్యనారాయణ రెడ్డి భూతు ఆద్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు